అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి - ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే దేవుడు !!
ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అయినవిల్లిలో నెలకొన్న శ్రీ విఘ్నేశ్వరస్వామి వారికి పేరు. కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవిల్లి గ్రామం ఉంటుంది. వృద్ధ గౌతమి నదీ తీరానికి ఆనుకుని ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి వారు దక్షిణాభిముఖుడై స్వయంభువుగా వెలసి ఉండడం ఒక విశేషం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదని, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం కన్నా పురాతనమైనదనీ, కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభంలో, అలాగే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినట్లుగా తెలుస్తోంది. తూర్పు వైపునున్న గోపుర మార్గంలో ప్రవేశిస్తే, ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ అన్నపూర్ణాదేవి వార్ల ఉపలయాలను దర్శించుకోవచ్చు. అలాగే శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఇక శ్రీ కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నారు. బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on...