శ్రీరంగంలో అన్నప్రసాద కేంద్రం: ఎంతో శుచిగా, రుచిగా, వేడిగా వడ్డిస్తారు !!
శ్రీరంగంలో నెలకొన్న రంగనాథ స్వామివారి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతీ రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది, అలాగే భక్తుల రద్దీతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. భక్తులకు మెరుగైన సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 2012న అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. సరిగ్గా మూడేళ్ల తర్వాత, అంటే సెప్టెంబర్ 2015లో వెయిటింగ్ హాల్ మరియు శాశ్వత అన్నదాన సత్రం భవనాలు ఆవిడచే ఆవిష్కరించబడ్డాయి. ఈ అన్నదాన కేంద్రంలో భక్తులకు చక్కగా ఒక టేబుల్ పైన అరిటాకు వేసి అందులో అన్నం, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగ మొదలైన పదార్ధాలను ఎంతో శుచిగా, రుచిగా మరియు వేడిగా వడ్డిస్తారు. ఈ అన్నప్రసాద కేంద్రం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో సుమారు 3 నుండి 4 వేల భక్తులకు ఆకలి బాధలను తీరుస్తోంది. శ్రీ రంగ రంగ: ARTVARKO Lord Ranganatha Swamy - Touching Shiva Lingam, Brahma from Navel - Brass, 7.5 Inches Advertisement* ...