మహానది చిత్రంలోని “శ్రీ రంగ రంగనాథుని" పాటలో చూపించిన ఆలయం ఎక్కడిది?
కమలహాసన్ నటించిన మహానది చిత్రంలో “శ్రీ రంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే...” అనే పాట మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఆ పాటలో చూపించిన పురాతన దేవాలయం ఎక్కడిది అనే కుతూహలం మీలో ఎంతమందికి కలిగింది? నేను మహానది సినిమాను 1994 లో మా వూరైన అమలాపురంలో చూడడం జరిగింది. వృత్తి రీత్యా నేను 1999 లో తమిళనాడుకు రావడం జరిగింది. కానీ ఈ ఆలయం ఎక్కడ వున్నది అనేది ఒక సంవత్సరం క్రితమే తెలిసింది. అంటే దాదాపు పాతిక సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే అనుకోకుండా ఈ ఆలయాన్ని ఈ మధ్యనే దర్శించడం కూడా జరిగింది. ఈ పాటలో శ్రీ రంగనాథుని గురించి వర్ణిస్తూ ఉంటే, మనం ఈ ఆలయం విష్ణువుకి సంబంధించినది అని అనుకుంటే చాలా పొరపాటే. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మయిలాడుదురై-కుంభకోణం నడుమున ఉన్న “త్రిభువనం” అనే ఊరిలో ఉంది. ఇది మహా శివునికి సంబంధించిన ఆలయం!! ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* త్రిభువనం ఆలయంలో ప్రధాన దైవం- శ్రీ కంపాహరేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం, ఒక రాజు పొరపాటున ఒక బ్...