Posts

Showing posts from November, 2025

తిరుపోరూర్: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడుతో ఆకాశంలో యుద్ధం చేసి గెలిచిన క్షేత్రం !!

Image
తిరుపోరూర్ కందస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది. ఇది చెన్నైకి 30 కిలోమీటర్లు, అలాగే మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలిచే శివ-పార్వతుల తనయుడైన స్కందుడుని తమిళనాడులో "కందస్వామి" అని పిలుస్తారు. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, పోర్ అంటే యుద్ధం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడు అనే రాక్షసుడితో ఆకాశంలో యుద్ధం చేసి గెలవడంతో, ఈ ప్రాంతానికి "తిరు-పోర్-ఊర్" అని పేరు వచ్చింది. అలాగే ఈ ప్రాంతాన్ని సమరపురి మరియు తారకాపురి అని కూడా పిలిచేవారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అగస్త్య మునికి వేదాలకు పునాది అయిన ప్రణవం గురించి వివరించాడని చెబుతారు. మదురైకి చెందిన చిదంబర స్వామి అనే సాధువు ఒక తాటిచెట్టు క్రిందనున్న పుట్టలో ఇప్పుడున్న విగ్రహాలను కనుగొన్నారని స్థలపురాణం చెబుతోంది. అందుకే స్వయంభువుగా వెలిసిన ఈ విగ్రహమూర్తులకు అభిషేకాలు ఉండవు, అన్ని ప్రత్యేక అభిషేకాలు ఇక్కడున్న సుబ్రహ్మణ్య యంత్రానికి మాత్రమే చేస్తారు. తొలుత 10వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరింతగా విస్తరించారని శాసనాలు...