శ్రీరంగంలో అన్నప్రసాద కేంద్రం: ఎంతో శుచిగా, రుచిగా, వేడిగా వడ్డిస్తారు !!

శ్రీరంగంలో నెలకొన్న రంగనాథ స్వామివారి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతీ రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది, అలాగే భక్తుల రద్దీతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. 

Srirangam Temple

భక్తులకు మెరుగైన సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 2012న అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. 

సరిగ్గా మూడేళ్ల తర్వాత, అంటే సెప్టెంబర్ 2015లో వెయిటింగ్ హాల్ మరియు శాశ్వత అన్నదాన సత్రం భవనాలు ఆవిడచే ఆవిష్కరించబడ్డాయి.

Srirangam Anna Prasada Kendram

ఈ అన్నదాన కేంద్రంలో భక్తులకు చక్కగా ఒక టేబుల్ పైన అరిటాకు వేసి అందులో అన్నం, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగ మొదలైన పదార్ధాలను ఎంతో శుచిగా, రుచిగా మరియు వేడిగా వడ్డిస్తారు. ఈ అన్నప్రసాద కేంద్రం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో సుమారు 3 నుండి 4 వేల భక్తులకు ఆకలి బాధలను తీరుస్తోంది. 

శ్రీ రంగ రంగ: ARTVARKO Lord Ranganatha Swamy - Touching Shiva Lingam, Brahma from Navel - Brass, 7.5 Inches
Advertisement*

గడచిన పదేళ్ళ కాలంలో కోటిమంది పైగా భక్తులు నిత్యాన్నదాన పథకాన్ని సద్వినియోగించుకున్నట్లుగా ఆలయ రికార్డులు చెబుతున్నాయి. 

Srirangam Anna Prasada Kendram

| అదనపు సమాచారం: జంబుకేశ్వరం: రెండవ పంచభూత శివలింగ క్షేత్రం. ఇది జల తత్వానికి ప్రతీక !!

ఈ అన్న ప్రసాద కేంద్రం దక్షిణం వైపున్న రంగరంగ గోపురం దగ్గరిలోని Information Center కౌంటర్ వెనకాల ఉంటుంది. ఇంకొక గుర్తు చెప్పాలంటే, ఇది శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణానికి అనుకుని ఉంటుంది. 

ఈసారి మీరు శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు, స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించే ప్రయత్నం చెయ్యండి; అలాగే మీ అనుభూతులు కామెంట్ బాక్స్ లో వ్రాయండి !!

Srirangam Anna Prasada Kendram

ఓం శ్రీరంగశాయినే నమః. మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!


Comments

Post a Comment