Posts

Showing posts from December, 2024

అరుణాచల గిరిప్రదక్షిణం: అష్ట లింగాలను ఎలా దర్శించుకోవాలి?? పూర్తి వివరాలు మీకోసం...

Image
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలయే ! స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః !! చిదంబరం వెళ్లి పరమ శివుడిని దర్శనం చేసుకున్నా, తిరువారూర్ లో జన్మించినా, తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వరుడిని స్మరించినా, కాశీలో మరణించినా మోక్షం తప్పక లభిస్తుంది.  అతి సులువైన “అరుణాచల” నామమే ఎన్నో కష్టాలను, పాపాలను తొలగిస్తుంది. అదే అరుణాచలం దర్శించినా, గిరి ప్రదక్షిణం చేసినా విశేష ఫలితం కలుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరుణాచలం...అరుణ అచలం...అంటే ఎర్రని రంగులో ఉన్న పర్వతం. ఈ కొండ స్థూలరూపంలో ఉన్న శివుడిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈ అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణం చేసినట్లే. ఈ కొండని అన్నామలై, అరుణగిరి, అరుణాచలం, అరుణై, సోనగిరి, సోనాచలం అని కూడా పిలుస్తారు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* పరమశివుని అవతారంగా చెప్పబడే జ్ఞానగురువు శ్రీ దక్షిణామూర్తిస్వామి వారు, ఒక సిద్ధయోగి రూపంలో ఇప్పటకీ ఈ కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తులు నమ్మక...