Posts

Showing posts from April, 2024

తిరుపతిలో వకుళమాత ఆలయం చాలా బాగా డెవలప్ చేసారు. ఏ మాత్రం మిస్ కాకుండా దర్శించండి !!

Image
వకుళాదేవి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పెంచిన తల్లి అని మన అందరికీ తెలిసిన విషయమే !! ఈమె ద్వాపరయుగంలో యశోద, అయితే శ్రీకృష్ణుడి యొక్క వివాహాలు ఏ ఒక్కటీ తన చేతులు మీదుగా జరగక పోవడం వల్ల, వకుళమాతకు కలియుగంలో ఆ అవకాశం దక్కేలా వరం పొందినది !! తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరుబండ గుట్టపై వకుళమాతకు ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం 1198వ సంవత్సరంలో మూడవ కుళోత్తుంగ చోళరాజు కాలంలో నిర్మించబడినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ఆలయం, 320 ఏండ్ల క్రితం మైసూర్ పాలకుడైన హైదర్ అలీ దండయాత్రల్లో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే చాలా వివాదాల తర్వాత, TTD వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి చాలా సుందరంగా పునర్నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని జూన్ 2023 లో ప్రారంభించడం జరిగినది. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? పేరూరు బండపై నెలకొన్న వకుళమాత ఆలయంలో నైవైద్యం అయిన తర్వాతే, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదన జరుగుతుంది అని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, తిరుమల ఆలయంలో మా...