పంచ భాస్కర స్థలాలలో ఒకటైన సూర్య దేవాలయం చెన్నైలో ఎక్కడ ఉందో తెలుసా ?!
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ! దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే !! సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం. ఆరోగ్య ప్రదాత కూడా. సాధారణంగా మనష్యులకు సూర్యుని యొక్క వివిధ పేర్లను పెట్టడం చూసి ఉంటాము. కానీ ఇపుడు మనం ఏకంగా సూర్యుడు అనే పేరుతో ఉన్న ఒక గ్రామం గురించి తెలుసుకుందాం !! జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయం చెన్నై చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాలలో ఒకటి. జ్ఞాయిరు అంటే తమిళంలో సూర్యుడు అని అర్థం. అలాగే తమిళనాడులో ఉన్న “పంచ భాస్కర” స్థలాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్దికెక్కింది. చెన్నై శివార్లలో ఉన్న రెడ్ హిల్స్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ జ్ఞాయిరు గ్రామం ఉంది. జ్ఞాయిరు గ్రామానికి వెళ్ళే దారి పంటపొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాస్తు దోష పరిహారం: Comelyns - Sun God Wall Decor - Brass, 290gms, 20x20X4 cm Advertisement* జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి ప్రవేశద్వారంగా 5 అంచెల చిన్న రాజగోపురం దక్షిణ దిక్కులో ఉంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య, పూల మొక్కలతో ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతం...