Posts

Showing posts from March, 2023

ఏటిగట్టు తెగకుండా గస్తీ కాసిన రామలక్ష్మణులు; బ్రిటిష్ అధికారే వారికి ఆలయాన్ని నిర్మించాడు !!

Image
భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు, అంటే 1798 సంవత్సరంలో, చెన్నైకి సమీపంలోని మధురాంతకం ప్రాంతం భారీవర్షాలతో అతలాకుతలమైనది. అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్- కల్నల్ లియోనెల్ బ్లేజ్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడు ఏటిగట్టుకు గండి పడుతుందో అని భయపడుతూ, ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ క్యాంప్ చేస్తాడు.  ఆ రాత్రి గంటగంటకు వరద ఉధృతి తీవ్రంగా పెరిగిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బ్రిటిష్ అధికారి, ఇక్కడ వెలసిన శ్రీ కోదండ రామస్వామి వారిని ఎంతో భక్తితో వేడుకుంటాడు. అప్పుడు చాలా ఆశ్చర్యంగా, ధనుర్బాణాలతో ఉన్న ఇద్దరు యోధులు ఏటిగట్టు తెగకుండా గస్తీ తిరుగుతూ ఉండడం అలాగే క్రమంగా వర్షం తగ్గిపోవడం కూడా జరుగుతుంది.  బ్రిటిష్ అధికారికి ఆ వచ్చిన ఇద్దరూ సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులుగా నిజాన్ని గ్రహించి కృతజ్ఞతా భావంతో సీతారాములవారి ఆలయాల పునర్నిర్మాణాన్ని దగ్గరుండి చేయిస్తాడు. వరదల సమయంలో ఏరు పొంగకుండా ఈ ప్రాంతాన్ని కాపాడినందుకు మధురాంతకం ప్రజలు రాములవారిని “ఏరికాత్త రామర్ (ఏటిని కాపాడిన రాములవారు)” అని పిలుచుకుంటారు.   సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ కోదండ రామస్వామి 8 అడుగుల ఆజానుబాహు రూపంలో త...