అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో ఇడుక్కు పిళ్లైయార్ ఆలయం !!
ఓం గం గణపతియే నమః !! ఇడుక్కు పిళ్లైయార్ ఆలయం అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో కుబేర లింగం మరియు ఈశాన్య లింగాలకు వెళ్ళే దారి మధ్యలో నెలకొని ఉంటుంది. తమిళంలో పిళ్లైయార్ అంటే వినాయకుడు. ఒక చిన్న గోపురంతో పొట్టిగా ఉండే స్థూపంలా నిర్మించబడిన ఈ ఆలయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. లోపల ఎటువంటి దేవుని విగ్రహం లేకపోయినా బయట మాత్రం నంది వేంచేసి ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు. కాయ కల్పం ప్రక్రియను రూపొందించిన ఇడైకాడు సిద్ధర్ అనే గొప్ప యోగి ఈ ఆలయం లోపల యంత్ర ప్రతిష్ట చేసినట్లుగా చెబుతారు. ఈ ఇడుక్కు పిళ్లైయార్ ఆలయానికి "మోక్ష మార్గం" అని కూడా పేరు ఉంది. ఈ ఆలయ మధ్యభాగంలో ఉన్న ఇరుకు మార్గం గుండా ఒక వైపుకు ఒత్తిగిల్లి నెమ్మదిగా పాకుతూ బయటకు వస్తే, మనలోని అహంకారం మరియు మనల్ని ఆవహించిన అన్నిరకాల దుష్టశక్తులు వైదొలగి, మనకు మున్ముందు ఒక సుసంపన్నమైన జీవితం కలుగుతుందని చెబుతారు. అలాగే జీవితంలో ఏవైనా కష్టాలు, సమస్యలు ఉంటే వాటి నుండి సునాయాసంగా బయటపడి ఒక గట్టున పడతామని మరి కొందరు భావిస్తారు. బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on Chair & Reading Ramayana with Kuber Diya -...