Posts

Showing posts from April, 2025

ఒకే ఒక్క శ్లోకంతో మొత్తం రామాయణాన్ని చదివిన ఫలితం ఎలా పొందాలి?

Image
రామాయణం... భారతదేశంలో ఈ మహా కావ్యం పేరు తెలియని హిందువులు ఎవరూ ఉండరు. దీనిని వాల్మీకి మహాముని సంస్కృతములో రచించారని అందరికీ తెలిసిందే. త్రేతాయుగ కాలంలో జరిగినట్లుగా వర్ణించిన ఈ కావ్యం హిందూ ధర్మానికి, సంస్కృతికి ప్రతీకగా అలాగే భారతీయ జీవన విధానానికి, నడవడికకు ప్రామాణికంగా నిలుస్తోంది. అందుకే శ్రీ రామాయణ మహాకావ్యం భారత దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా ఆదరించబడుతోంది. ఈ రామాయణ మహాకావ్యము 24 వేల శ్లోకాలతో ఏడు కాండములుగా విభజింపబడింది. ఒక్కొక్క కాండము మరిన్ని ఉప భాగాలుగా, అంటే 500 పైగా ఉన్న సర్గలుగా విభజించబడినది. ఈ ఏడు కాండాల్లో వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క జీవిత ఘట్టాలను, ఆయన ఆదర్శ జీవనాన్ని అలాగే ఇతరుల తోటి సంబంధ బాంధవ్యాలు గురించి ఎంతో చక్కగా వర్ణించారు. అలాంటి ఈ మహాకావ్యాన్ని అందరూ జీవితంలో ఒకసారైనా చదివి తరించాల్సిందే. శ్రీ రామ కోటి: Shri Rama Koti BIG/LARGE Size Paperback Advertisement* ఏ కారణం చేతనైనా ఈ మహాకావ్యాన్ని పూర్తిగా చదివే సౌలభ్యం లేనివారికి 108 నామాల్లో రామాయణాన్ని ఇమిడేటట్లు చేసిన ఘనత “శ్రీ నామ రామాయణం” లో చూడవచ్చు...