Posts

Showing posts from March, 2024

SV Vedic Sivalayam: మహాశివరాత్రి రోజున SVBC TVలో చూపించే శివలింగం ఇదే !!

Image
TTD వారి SVBC TV Studio తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ నుంచి జూపార్క్ కి వెళ్ళే బైపాస్ రోడ్డులో ఉంటుంది. SVBC శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసు పక్కనే ఉన్న స్థలంలోనే శ్రీవారి నమూనా ఆలయం, అలాగే అటు ప్రక్కన SV Vedic Sivalayam కూడా ఉంటుంది. ప్రతీ మహాశివరాత్రి రోజున SVBC TVలో మీరు చూసే శివలింగం ఇదే !! పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ధ్యానారామంలో నెలకొన్న మహా శివలింగాన్ని దర్శిస్తే మన మనస్సు ఎంతో భక్తి భావనతో ఉప్పొంగుతుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ శిలతో తయారుచేయబడిన ఈ శివలింగం యొక్క ఎత్తు 11 అడుగులు, అలాగే బరువు సుమారు 25 టన్నులు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* కోటి రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి, తొందరలోనే ఆలయం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా SV Vedic Sivalayam దర్శించి, తరించండి. మీ సౌలభ్యం కొరకు, గూగుల్ మ్యాప్ డీటైల్స్ కిందనున్న description box లో ఇచ్చాను. | అదనపు సమాచారం...