Posts

Showing posts from December, 2023

ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !!

Image
పరమేశ్వర విణ్ణగర్ పురే రుచిరైరంమద తీర్థ సమ్యుతే !  జలనాధ దిశా ముఖాసనో పరవైకుంఠ లతా సమన్విత: !! విమానేతు ముకుందాఖ్యే శ్రీవైకుంఠ విభుస్సదా !  శ్రీ మత్పల్లవ రాజాక్షి గోచర:కలిహస్తుత: !! పరమేశ్వర విణ్ణగరమ్‌ (కాంచీపురం) లో వైకుంఠ పెరుమాళ్ - వైకుంఠ నాయకి - ఐరంమద తీర్థము - పశ్చిమ ముఖము - కూర్చున్నసేవ - ముకుంద విమానము - పల్లవరాజునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. కాంచీపురంలో నెలకొన్న పరమపద వైకుంఠ పెరుమాళ్ ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ఆలయాన్ని పల్లవరాజైన 2వ నందివర్మన్ 690 సంవత్సరంలో నిర్మించాడని చెబుతారు. అయితే ఈ ఆలయానికి రాజగోపురం ఉండకపోవడం గమనించవచ్చు. కంచిలోని శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి పరమేశ్వర విణ్ణగరమ్ అని కూడా పేరు ఉంది. మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* ఇప్పుడు ఈ క్షేత్రానికి సంబందించిన స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు విదర్భదేశంగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని విరోచ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో విష్ణుమూర్తి యొక్క ద్...