తిరుమల రహస్యం: పంచ పాండవ తీర్థంలో క్షేత్ర పాలక శిల ఎందుకు వుంది?
సాధారణంగా శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి, వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్ర పాలకుడుగా ఉండడం చూడవచ్చు. భారతదేశంలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది. తిరుమల ఆలయానికి క్షేత్ర పాలకుడు రుద్రుడు, అంటే శివుడు. గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న పంచ పాండవ తీర్థంలో “క్షేత్ర పాలక శిల” ఉంటుంది. కానీ ఒకప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ప్రధాన ఆలయానికి ఈశాన్య మూలలో ఉండేది. ప్రతీ రోజూ పవళింపు సేవ అనంతరం, ఆలయాన్ని మూసివేసిన తర్వాత అర్చకులు ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది. అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల మాడవీధుల్లో దొర్లుతూ రాత్రంతా గస్తీ కాసేది. తెల్లవారు జామున సుప్రభాత సేవకు ఆలయాన్ని తెరిచే సమయంలో అర్చకులు మళ్ళీ ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది. కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch Advertisement* అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ఇక గస్తీ తిరగడం ఆపి, తన యథాస్థానమైన ఈశాన్య మూలకు వచ్చి నిశ్చలంగా ఉండేది...