తిరుమల యాత్రలో జపాలీ తీర్థం అస్సలు మిస్ కావద్దు, ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది !!
జాపాలి తీర్థం తిరుమల చుట్టూ ఉన్న పరమ పవిత్రమైన 108 దివ్యతీర్థాల్లో ఒకటి. దీనికే జాబాలి తీర్థం అని కూడా పేరు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జాపాలి తీర్థం చేరుకోవాలంటే, పాపవినాశనము వెళ్ళే రోడ్డు మార్గం చాలా అనుకూలమైనది. శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం మరియు ఆకాశగంగకు వెళ్ళే దారిలో ఉంటుంది. ప్రధాన రహదారి నుండి 100 మీటర్ల లోపలకి వెళితే వాహనాలు నిలపడానికి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. అక్కడ నుంచి సుమారు అర కిలోమీటరు దూరం మెట్లమార్గంలో నడవాల్సి వస్తుంది. జాపాలి తీర్థం ఎత్తైన వృక్షాల నడుమ, పక్షుల కువకువలతో, చల్లని వాతావరణంలో చాలా ప్రశాంతంగా మరియు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇది తిరుమల యాత్రలో చూడాల్సిన ఒక గొప్ప పుణ్య క్షేత్రం, అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. తిరుమలకు గ్రామదేవత అయిన బాట గంగమ్మ తల్లి ఆలయం నుంచి పాపవినాశనము వెళ్ళే నడక దారి ఇక్కడ కలుస్తుంది. | అదనపు సమాచారం: జాబాలి తీర్థంకి వెళ్ళే దారిలో కనిపించే రుద్ర శిల (క్షేత్రపాలకుడు) యొక్క రహస్యం ఏమిటి? ఆలయం వెలుపన ఉన్న ఒక చెట్టు మొదట్లో సహజసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి రూపం ప్రత్యేక ఆకర్...