చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?
తమిళనాడులోని శైవ క్షేత్రాల్లో చెన్నై నగరంలోని మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధి. మైలాపూర్ కి "తిరుమయిలై" అని కూడా పేరు. 7వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించిన ఈ ఆలయం, పోర్చుగ్రీస్ వారి దండయాత్రల్లో ధ్వంసమవడంతో 14వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులచే పునర్నిర్మించబడింది. తూర్పు దిక్కులో ఉన్న 120 అడుగుల గోపురం 1906లో నిర్మించారు. 7 అంతస్తులుగా ఉన్న ఈ గోపురంలో శిల్ప కళా నైపుణ్యం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న గోపురం పుష్కరిణి వైపు ఉంటుంది. చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass Advertisement* ఇక్కడ ఉన్న పుష్కరిణి చాలా పెద్దది, ఇది చెన్నై మహా నగరానికి ఒక ముఖ్యమైన లాండ్ మార్క్. ఏటా జరిగే రధోత్సవం నాడు ఈ పుష్కరిణి వీధులు ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ పుష్కరిణి గట్టు పితృ తర్పణాలకు, ఇతర కార్యక్రమాలకు ఒక వేదిక. ఈ ఆలయంలో ప్రధాన దైవం పేరు- కపాలీశ్వరుడు, అమ్మవారి పేరు కర్పగంబాళ్. మార్చ్-ఏప్రిల్ నెలల మధ్యలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవం ఇక్కడుండే వారికి ఒక అతి పెద్ద పండగ....